TG: కాళేశ్వరం ద్వారా నల్గొండ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్లు మాజీమంత్రి హరీశ్ రావు తెలిపారు. మిషన్ భగీరథకు అయిన ఖర్చు రూ.28 వేల కోట్లు అని వెల్లడించారు. మిషన్ భగీరథపై మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ద్వారా నల్గొండ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్లు వెల్లడించారు. నల్గొండలో వైద్య కళాశాల పెట్టింది కేసీఆర్ అని స్పష్టం చేశారు.