AP: రాష్ట్రంలో బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ రూ.లక్షా పది వేల కోట్ల పెట్టుబడి పెడుతోందని మంత్రి లోకేష్ వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఇది మరో భారీ పెట్టుబడి అని తెలిపారు. పునరుత్పాదక విద్యుత్, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజ్ రంగాల్లో పెడుతున్నట్లు చెప్పారు. రియల్ఎస్టేట్, బీసీసీలు, పోర్టుల్లోనూ పెట్టుబడులు వస్తున్నట్లు ప్రకటించారు.