AP: రాష్ట్ర ప్రభుత్వం పేదలను మోసం చేస్తోందని మాజీమంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ‘రాష్ట్రంలో ఎరువులు దొరకవు, పంటలకు గిట్టుబాటు ధర లేదు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరంచేయడమే లక్ష్యంగా పాలన సాగుతోంది. వ్యవసాయ మంత్రి ఉన్నా యూరియా బ్లాక్ మార్కెట్ అవుతోంది. హోం శాఖ కేవలం తప్పుడు కేసులు పెట్టడానికే పరిమితమైంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.