TG: జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికే ఓటేశారని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధిని బాధ్యతగా తీసుకుంటామని, ఈ ఎన్నికలను మాజీ మంత్రి కేటీఆర్ రెఫరెండంగా భావిస్తారా అని ప్రశ్నించారు. ప్రజల నమ్మకాన్ని బీఆర్ఎస్ కోల్పోయిందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.