TG: ఖమ్మం జిల్లా కాంగ్రెస్కు కంచుకోట అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొట్టమొదటి తెలంగాణ ఉద్యమానికి పునాది పడింది ఇక్కడే అని ఉద్ఘాటించారు. ఎర్త్ వర్సిటీకి తెలంగాణ ఇచ్చిన మన్మోహన్ సింగ్ పేరు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీలు, ప్రతినియోజకవర్గానికి యంగ్ ఇండియా స్కూల్స్ ఇచ్చానని రేవంత్ రెడ్డి అన్నారు.