దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఓటర్ల జాబితా సవరణ(SIR) వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ అంశంపై పార్లమెంట్ దద్దరిల్లుతోంది. ఈసీ చేపట్టిన ఈ ప్రక్రియలో అవకతవకలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్లపై కోర్టు ఏం చెబుతుందోనని ఉత్కంఠ నెలకొంది. విపక్షాలు కూడా ఈ తీర్పు కోసమే ఎదురుచూస్తున్నాయి.