AP: కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ‘ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టింది. కేబినెట్, గవర్నర్ అనుమతి లేకుండా అప్పులు తీసుకువచ్చారు. మీ కన్న అనుభవంలో ఉన్న మోదీ, నితీష్ కుమార్ ఇన్ని అప్పులు తెచ్చారా రూ.2లక్షల 66వేల 517 కోట్ల అప్పుతో ఏం చేశారు. దానిపై శ్వేత పత్రం విడుదల చేస్తారా? సూపర్-6, సూపర్-8 లో ఏం చేశారు’ అని ప్రశ్నించారు.