TG: ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేలన్నీ చెప్పాయని, ఆఖరి మూడు రోజులు ఏం జరిగిందో అందరికీ తెలుసని ఆరోపించారు. ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సే అని ఈ ఎన్నిక ద్వారా స్పష్టమైందన్నారు. ఆరు గ్యారంటీలపై ప్రభుత్వ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లామని చెప్పారు. కులం, మతం పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేయలేదన్నారు.