TG: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో అధికారులు ఆలయ ప్రధాన గేటుకు కూడా తాళంవేశారు. అయితే ముందస్తు సమాచారం లేకుండా ఇలా దర్శనాలు నిలిపివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చలి తీవ్రంగా ఉన్నప్పటికీ ఎంతో దూరం నుంచి స్వామి దర్శనం కోసం తెల్లవారుజామునే వచ్చామని భక్తులు ఆందోళనకు దిగారు.