AP: నైరుతి-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దిత్వా తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది నైరుతి దిశగా పయనించి కొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 24 గంటల్లో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30 కి.మీ వేగంగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.