AP: CM చంద్రబాబు సమక్షంలో రిలయన్స్ ఎనర్జీ.. అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో రిలయన్స్ 500 ఆధునిక బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. గతనెల ముకేష్ అంబానీ, అనంత్ అంబానీని మంత్రి లోకేష్ ముంబైలో కలిసి గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీకి ఏపీ ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఆరోజే వారి మధ్య అవగాహన కల్పించారు. పెట్టుబడులకు పూర్తిస్థాయి రోడ్ మ్యాప్‌తో చంద్రబాబు సమక్షంలో ఒప్పందం జరిగింది.