TG: చార్ ధామ్ యాత్రకు వెళ్లిన సిరిసిల్ల జిల్లా వేములవాడకి చెందిన ఆకుల నరేష్ అనే వ్యక్తి హఠాన్మరణం చెందాడు. ఆకుల నరేష్ కుటుంబంతో కలిసి నాలుగు రోజుల క్రితం చార్ ధామ్ యాత్రకు వెళ్లారు. ఈరోజు ఉదయం కేదార్ నాథ్ సమీపంలో ఆయనకు శ్వాస సంబంధించిన సమస్య తీవ్రం కావడంతో ఆకుల నరేష్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.