AP: కల్తీ మద్యం కేసు ఫైళ్లను మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మాయం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ‘కేసుల డాాక్యుమెంట్లు పరిశీలించే సమయానికి పత్రాలు మాయమయ్యాయి. పత్రాలన్నీ ఉంటేనే ప్రత్యేక కోర్టులో కేసుల విచారణ ప్రారంభమవుతుంది. నేరాలతో పాటు పత్రాలు మాయం చేయడం కాకాణికి అలవాటుగా మారింది’ అని పేర్కొన్నారు.