TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఆరో రౌండ్ తర్వాత కాంగ్రెస్‌కు 15,589 ఓట్ల ఆధిక్యం లభించింది. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. ‘2028లో తగ్గేదేలే. 2028లో రప్పా.. రప్పా’ అనే ఫ్లెక్సీలను కార్యకర్తలు ప్రదర్శించారు. కాసేపట్లో గాంధీభవన్‌కు మంత్రులు చేరుకోనున్నారు.