AP: విశాఖలో సీసీఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. మన దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని సీఐఐ అధ్యక్షుడు రాజీవ్ పేర్కొన్నారు. కేంద్రం సాయంతో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పారు. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం వేగంగా ముందుకెళ్తోందని GMR సంస్థ ఛైర్మన్ గ్రంధి మల్లిఖార్జునరావు వెల్లడించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు.