తమిళనాడులోని కోయంబత్తూర్లో స్థానిక BJP కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పునర్విభజన ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలు తగ్గవు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై CM స్టాలిన్, ఆయన కుమారుడు ప్రజల్లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు మేము అన్యాయం జరగనివ్వము’ అని స్పష్టం చేశారు.