సంచార్ సాథీ యాప్‌పై కేంద్రం కీలక వివరణ ఇచ్చింది. ఈ యాప్‌ను వినియోగదారులు తమకు ఇష్టం లేకపోతే ఎప్పుడైనా ఫోన్ నుంచి తొలగించవచ్చని (Uninstall) స్పష్టం చేసింది. కేవలం సైబర్ నేరాలను అరికట్టడం, పోయిన ఫోన్లను ట్రాక్ చేయడం కోసమే దీన్ని తీసుకొచ్చామని వెల్లడించింది. దీనిపై ఎలాంటి అపోహలు వద్దని, డేటా భద్రతకు ఢోకా లేదని ప్రభుత్వం తెలిపింది.