ఢిల్లీ పేలుళ్ల ఘటనపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ముఫ్తీ స్పందించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ చర్యకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో నిందితులు దోషులుగా తేలే వరకు వారిని నిందించవద్దని.. అలాగే వారి తల్లిదండ్రులను విచారణ పేరుతో వేధించవద్దని కోరారు.