హిందీ భాషపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భాష కేవలం మాట్లాడటానికి మాత్రమే కాదని, సంస్కృతికి అది ఒక గుర్తింపు వంటిదని ఆయన అన్నారు. భారతదేశంలో 22 అధికార భాషలు, 300కు పైగా అనధికార భాషలు ఉన్నాయని గుర్తుచేశారు. తాము ఎవరిపైనా తెలుగు భాషను రుద్దనప్పుడు, కేంద్రం హిందీని ఇతరులపై ఎందుకు రుద్దే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ప్రశ్నించారు.