ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ PAYTMలో దిగ్గజ పెట్టుబడి సంస్థలు భారీగా ఇన్వెస్ట్ చేశాయి. గ్లోబల్ కంపెనీలు గోల్డ్‌మన్ శాక్స్, సిటీ గ్రూప్, సొసైటీ జనరల్ పేటీఎమ్ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో 1.34 శాతం వాటాను కొనుగోలు చేశాయి. మొత్తం 85.98 లక్షల షేర్లను రూ.1,120.65 ధరకు మొత్తం రూ. 963 కోట్లకు కొనుగోలు చేశాయి.