ప్రతిరోజు బాదం పాలు తాగడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎముకలు దృఢంగా మారడంతో పాటు దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి బలపడుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యలు దరిచేరవు. బరువు అదుపులో ఉంటుంది. నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.