AP: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఉప ఖజానా శాఖ కార్యాలయంలో 141 ఏళ్ల నాటి పెట్టె ఉంది. 1884లో మద్రాసులో దీన్ని తయారు చేశారు. దీని బరువు 3 వేల కిలోలకు పైనే ఉంటుంది. అందులో పెట్టె పైకప్పు బరువే 500 కిలోలు. బ్రిటిష్ కాలం నుంచి ఈ కార్యాలయం ఒకే భవనంలో కొనసాగుతోంది. విలువైన నగదు, పత్రాలను భద్రపరిచేందుకు వీలుగా అప్పట్లో ఈ ఇనుప పెట్టెను తయారు చేయించారట.