కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన పోక్సో కేసు విచారణ(ట్రయల్)పై స్టే విధించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన వేసిన పిటిషన్పై స్పందించిన కోర్టు.. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మెరిట్స్ ఆధారంగా వాదనలు వినే అంశంపై మళ్లీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సూచించింది.