సార్వత్రిక ఎన్నికల సమయంలో తమ ఎగ్జిట్ పోల్స్ అంచనా తప్పడంతో యాక్సిస్ మై ఇండియా ఛైర్మన్, ఎండీ ప్రదీప్ గుప్తా లైవ్‌లోనే కంటతడి పెట్టుకున్నారు. అయితే.. లోక్‌సభతో పాటు హర్యానా అసెంబ్లీ ఎన్నికల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వేల్లో తప్పులకు అవకాశం లేకుండా క్షేత్రస్థాయిలో సిబ్బందిని రెట్టింపు చేసినట్లు తెలిపారు.