ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ భారత్లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల, ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనుంది. దేశంలో డేటా సెంటర్ల విస్తరణ, AI, క్లౌడ్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులను ఉపయోగించనుంది.