బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మిజోరంలోని డంపా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఇవాళ ఓట్ల లెక్కింపు జరగగా మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి డాక్టర్ లాల్ తంగ్లిన విజయం సాధించారు. 6,981 ఓట్లతో గెలుపొందారు. స్థానిక ఎమ్మెల్యే లాల్రింట్లుంగా సైలా మృతితో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో పోలింగ్ జరిగింది.