TG: రాష్ట్రంలో మూడేళ్లలో ధాన్యం ఉత్పత్తి మూడు రెట్లు పెరిగినప్పటికీ వాటిని నిల్వ చేసేందుకు అవసరమైన మేరకు గోదాములు లేవు. దీంతో కొత్తగా 26 గోదాములను నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో 12 గోదాములు ప్రభుత్వ నిధులతో, మరో 14 నాబార్డు నిధులతో నిర్మిస్తోంది. వీటి కోసం రూ.295.68 కోట్లు ఖర్చు చేస్తుంది. 2.91 లక్షల టన్నుల స్టోరేజీతో గోదాముల నిర్మాణం జరగనుంది.