పామును చూస్తే భయంతో ఆమడ దూరం పరిగెడతాం. కానీ, మహారాష్ట్ర షెట్ఫాల్ గ్రామంలో ఎక్కడ చూసినా సర్పాలే కన్పిస్తాయి. ప్రతిఒక్కరూ తమ ఇంట్లో పాము కోసం ప్రత్యేక స్థలం కూడా ఏర్పాటు చేసుకున్నారు. చిన్నపిల్లలు కూడా ఏ మాత్రం భయపడరు. కొన్నిసార్లు పాములు పాఠశాలకు కూడా వెళ్తుంటాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు చూసీచూడనట్లు వ్యవహరిస్తారు. కాగా, ఆ గ్రామస్తులు సర్పాలను శివుని ప్రతీకగా భావిస్తారు.