AP: లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంపై సీఐడీ.. హైకోర్టుకు అదనపు నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో అదనపు నివేదిక మరో రెండు సెట్లను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పరిశీలన నిమిత్తం నివేదికలు వారి ముందు ఉంచాలని రిజిస్ట్రీకి స్పష్టీకరణ చేసింది. లోక్ అదాలత్ అవార్డు చట్టబద్ధతను తేల్చేందుకు సీజే ధర్మాసనం విచారణ జరుపుతోంది.