AP: కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలు నిలుపుతుంటే, వైసీపీ మాత్రం ‘రఫా రఫా’ అంటూ తలలు నరుకుతామని బెదిరిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పాలకొల్లులో 106 మంది లబ్ధిదారులకు రూ.49.40 లక్షల CMRF చెక్కులను ఆయన పంపిణీ చేశారు. గత 23 నెలల్లో నియోజకవర్గానికి రూ.13.60 కోట్ల వైద్యసాయం అందించామన్నారు. గత ఐదేళ్ల YCP పాలనలో ఎవరికైనా CMRF సాయం అందిందా అని మంత్రి ప్రశ్నించారు.