దేశంలో రిచ్చెస్ట్ ప్రాంతీయ పార్టీగా BRS నిలిచింది. ఆ పార్టీ తమ ఖాతాలో రూ.1,449 కోట్లు ఉన్నట్లు ఈసీకి వివరాలు తెలిపినట్లు సమాచారం. అటు TDP, YCP ఖాతాల్లో ఉన్న ముగింపు నిల్వలను కూడా EC వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. TDP ఖాతాలో రూ.272 కోట్లు ఉన్నాయి. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో BRS ఖాతాల్లోనే ఎక్కువ నగదు ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో పెట్టిన ఖర్చుల వివరాలపై CECకి ఆ పార్టీ ఆడిట్ నివేదిక సమర్పించింది.