AP: TDP మహానాడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. అది మహానాడు కాదని.. ప్రజలకు చేసిన దగానాడని అన్నారు. దీన్ని చంద్రబాబు, కుమారుల భజననాడు అనాలని విమర్శించారు. అలాగే ప్రభుత్వం నిర్వహించింది మెగా DSC కాదు.. దగా DSC అని ఆరోపించారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో దోపిడీని ప్రజల ముందు ఎండగడతామన్నారు.