TG: ఇండిగో విమానాల రద్దు సంక్షోభం కొనసాగుతోంది. ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావాల్సిన 54 విమానాలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 61 విమానాలను అధికారులు రద్దు చేశారు. మొత్తం 115 విమానాలను రద్దు చేసినట్లు సమాచారం. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.