AP: రెవెన్యూ సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. 20 ఏళ్లుగా పేదల జీవనోపాధికి MLA గద్దె రామ్మోహన్ కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. ఇప్పటికే రూ.8 కోట్ల విలువైన CMRF చెక్కులు అందించడం అభినందనీయమన్నారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యదిక ప్రాధాన్యత ఇస్తోందని గద్దె రామ్మోహన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కరికి కూడా సహాయం చేయలేదన్నారు.