TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకునేది లేదని.. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సారీ చెబితే ఒకటో, రెండో సినిమాలు ఆడుతాయి.. లేదంటే తెలంగాణలో పవన్ సినిమాలు ఆడవు అని హెచ్చరించారు.