TG: జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ధర్నా చేసిన నిరుద్యోగులను అరెస్టు చేయడంపై జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నమ్మి వంచిస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి.. రెండేళ్లలో 20 వేల ఉద్యోగాలకు మించి ఇవ్వలేదని విమర్శించారు. తక్షణమే అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.