ప్రధాని మోదీ రెండ్రోజుల భూటాన్ పర్యటనను ముగించుకున్నారు. ఈ సందర్భంగా భూటాన్ నాలుగో రాజు జిగ్మే సింగ్యే వాంగ్చుక్తో భేటీ అయ్యారు. అనంతరం ఆయనతో కలిసి జల విద్యుత్ ప్రాజెక్టును మోదీ ప్రారంభించారు. రక్షణ, ఇంధనం, సాంకేతికతపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. అలాగే, భూటాన్ మాజీ రాజు 70వ జన్మదిన వేడుకల్లో మోదీ పాల్గొన్నారు.