TG: హైదరాబాద్ రాయదుర్గంలో అర్ధరాత్రి పోకిరీలు రోడ్లపైకి వచ్చి హంగామా చేశారు. కార్లు, బైకులతో రేసింగ్ చేశారు. పోలీసులు హెచ్చరించినా వినలేదు. పోలీసులపైకే రేసర్లు దూసుకొచ్చారు. దీంతో ఓపిక నశించి.. కారు అద్దాలు ధ్వంసం చేసి.. ఆ యువకులను పోలీసులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి.. కార్లు, బైకులను స్వాధీనం చేసుకున్నారు.