AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద పాండా భావోద్వేగానికి గురయ్యారు. ‘దేశభక్తితో భక్తుల కోసం ఆలయం నిర్మించా. వెంకటేశ్వరస్వామే నాతో ఆలయం కట్టించారు. అనుకోకుండా అపశృతి చేసుకోవడం బాధాకరం. నాపై ఒకటి కాదు.. 50 కేసులు పెట్టుకోండి. ఎన్ని కేసులు పెట్టినా శ్రీనివాసుడు చూసుకుంటాడు. ఆలయం కట్టడానికి ఎవరి అనుమతి అవసరం లేదు’ అని పేర్కొన్నారు.