AP: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా విశాఖలో ఏక్తా రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరై.. ప్రారంభించారు. ఈ రన్లో విద్యార్థులు, నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.