మంత్రి లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా వివిధ సంస్థలతో ఆయన వరుస భేటీలు నిర్వహించారు. శాన్ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డితో సమావేశమై.. రాష్ట్రంలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఓప్స్ ర్యాంప్ CEO వర్మతో సమావేశమైన లోకేష్.. అమరావతిలో డిజైన్, ఇన్నోవేషన్ అకాడమీ ఏర్పాటు చేయాలని కోరారు.