ఎన్నికల కమిషన్ (ఈసీ)ను కేంద్రం కబ్జా చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్ల చోరీకి సంబంధించి తమవద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. RSS వాదులకు సమానత్వంపై నమ్మకం లేదన్నారు. దేశంలోని వైవిధ్యాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. నిజాలు మాట్లాడుతుంటే BJP ఎంపీలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. రాహుల్ వ్యాఖ్యలతో సభలో గందరగోళం ఏర్పడింది.