TG: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో విడతలో 414 మంది సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. 8,304 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలి దశలో 395 గ్రామాల్లో సర్పంచి పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఈనెల 11న తొలి విడత, 14న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.