AP: సవాళ్లను ఎదుర్కోవడం తనకు కొత్త కాదని CM చంద్రబాబు అన్నారు. బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఓ EU ప్రతినిధి అడిగిన ప్రశ్నకు CM ఇలా సమాధానమిచ్చారు. ‘సహకార వ్యవస్థలో రాష్ట్రాల మధ్య పోటీ సహజం. పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలి. ఒకప్పుడు దేశ IT రాజధాని బెంగళూరుకు పోటీగా హైదరాబాద్‌ని తీసుకొచ్చే ప్రయత్నం చేశా’ అని అన్నారు.