భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు నాడు వెలువడిన బీహార్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు ఘోర పరాజయాన్ని మిగిల్చాయి. మరోవైపు NDA కూటమి అద్భుతమైన మెజారిటీతో ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. కాంగ్రెస్ మాత్రం సింగిల్ డిజిట్(ప్రస్తుతం 4 సీట్లు)కే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. కీలక రాష్ట్రంలో ఈ ఫలితం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.