AP: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ‘మాటా-మంతి’ పేరుతో మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో జిల్లాల నుంచి వచ్చే రెండు వేల మంది ఉద్యోగులతో రేపు ఆయన సమావేశం కానున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఉద్యోగుల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు.