TG: హిల్ట్ భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. కాంగ్రెస్ సర్కార్ విలువైన భూములను మార్కెట్ విలువ కంటే తక్కువకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. హిల్ట్ పాలసీ పేరుతో రూ.5 లక్షల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తుందని, రేపు, ఎల్లుండి పారిశ్రామికవాడల్లో పార్టీ బృందాలు క్షేత్రస్తాయిలో పర్యటిస్తాయని కేటీఆర్ తెలిపారు.