వేసవిలో చాలా మంది ఎయిర్ కూలర్లు ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఇటీవల కూలర్లు పేలిపోవడం లేదా మంటలు చెలరేగడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. సాధారణంగా కూలర్లో ఉండే ఎలక్ట్రిక్ భాగాల్లో లోపాలు, అధిక వినియోగం, నిర్లక్ష్యం, సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతాయి. కూలర్ మోటార్‌కు తగినంత విశ్రాంతి దొరకనప్పుడు, అది వేడెక్కి పేలే అవకాశాలు ఉంటాయి.