కేరళ శబరిమల అయ్యప్ప క్షేత్రానికి 15 రోజుల్లో రూ.92 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు వెల్లడించింది. గతేడాది ఇదే సీజన్లో రూ.69 కోట్లు వసూలయ్యాయని, ఈ ఏడాది 33.33 శాతం పెరిగిందని పేర్కొంది. ప్రసాదం విక్రయాల ద్వారా రూ.47 కోట్లు సమకూరినట్లు టీడీబీ వివరించింది. హుండీ ఆదాయం గతేడాదితో పోల్చుకుంటే 18.18 శాతం పెరిగిందని వెల్లడించింది.