TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఆరో రౌండ్లోనూ బీజేపీ పార్టీ వెనుకంజలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. 4 రౌండ్లలోనూ బీజేపీకి 7,296 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగగా, బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో ఉంది. ఈ ఉపఎన్నికలో బీజేపీ జూబ్లీహిల్స్లో ప్రభావం చూపలేకపోయింది.